పురుడు పొసిన రైట‌ర్

అత‌నో రైట‌ర్. స్ర్కిప్ట్ కోసం స‌మాజాన్ని చ‌ద‌వాడు. వేల పుస్త‌కాలు చ‌దివాడు. అందులో భాగంగా వైద్యాన్ని చ‌దివాడు. ప్రాక్టిక‌ల్ గా వైద్యం చేసిన అనుభ‌వం లేక‌పోయినా చ‌దివిన జ్ఞాన‌మే ! ఓ త‌ల్లి బిడ్డ ప్రాణాన్ని కాపాడ గ‌లిగాడు. లాక్ డౌన్ వేళ దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో తెలిసిందే. గ‌డ‌ప దాట‌డానికి వీలు లేకుండా ఉంది. నిత్యం రోగుల‌తో కిట కిట‌లాడినే ఆసుప‌త్రులు కూడా మూత‌ప‌డ్డాయి. ఇప్పుడు ఎవ‌రి ఆరోగ్యం వాళ్లే జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. ఇలా ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా! వ‌చ్చే ముప్పు రాక మాన‌దు. అలాగే విధి ఓ గ‌ర్బీణిని కాటేయ‌డానికి మాటేసింది.

ఒడిశాకు చెందిన భ‌న‌వ నిర్మాణ కార్మికులు స‌హా ఇంకొంత మంది గుడిసెలు వేసుకుని త‌మిళ‌నాడులోని కోవై సింగ‌న‌ల్లూరు ప్రాంతంలో నివ‌సిస్తున్నారు. వారిలో ఒక‌రు నిండు గ‌ర్భిణి. స‌రిగ్గా ఇదే స‌మయంలో అనుకోకుండా నొప్పులు మొద‌ల‌య్యాయి. అంబులెన్స్ కు ఫోన్ చేసారు. కానీ అది వ‌చ్చేలోపు ఇక్క‌డ ప్రాణాలు నిల‌వ‌డం క‌ష్ట‌మ‌ని తెలుసుకున్న ర‌చ‌యిత చంద్ర‌న్ సాహ‌సం చేసి పురుడు పోసి త‌ల్లిబిడ్డ‌ల‌కు ప్రాణ బిక్ష పెట్టాడు. క‌రోనా భ‌యంతో ఆడ‌వారు గానీ..మిగ‌తా ఎవ‌రూ ఆ గ‌ర్భిణీ ద‌గ్గ‌ర‌కు రాక‌పోవ‌డంతో చంద్ర‌న్ దేవుడిలా అక్క‌డి వాలి రెండు ప్రాణాలు పోసాడు. దీంతో చంద్ర‌న్ ఇప్పుడు రియాల్ హీరో అయ్యాడు.

చంద్ర‌న్ సినిమా ర‌చ‌యిత కూడా. వెట్రీమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం `విచార‌ణై` చిత్రానికి చంద్ర‌న్ క‌థ అందించాడు. ఇత‌ను ఒక ఆటో డ్రైవ‌ర్. ర‌చ‌న‌లంటే ఇష్టం. దాంతోనే ఖాళీ స‌మ‌యంలో న‌వ‌ల‌లు..క‌థ‌లు రాస్తుంటాడు. అలా వెట్రీమార‌న్ కు చంద్ర‌న్ స్టోరీ న‌చ్చ‌డంతో త‌న క‌థ‌ని సినిమాగా తెర‌కెక్కించాడు. తాజా ఘ‌ట‌న‌లో చంద్ర‌న్ ని కోలీవుడ్ ప్రముఖులు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.