Tollywood Director:సక్సెస్ లేనపుడు పరిస్థితి కరోనా డెడ్‌బాడీని చూసినట్టు చూస్తారని ఆయనకు లేటెస్ట్‌గా తెలిసిందని డైరెక్టర్ రాజా వన్నెం రెడ్డి చెప్పారు. కరోనా వచ్చి చచ్చిపోతే భార్య గానీ, కొడుకు గానీ ఎవరూ రారని, అలాగే సక్సెస్ అనేది రాకపోతే కరోనా డెడ్‌బాడీని చూసినంత దరిద్రంగా చూస్తారని ఆయన తెలిపారు. విజయం అనేది లేకపోతే ఎవరినీ ఎవరినీ పట్టించుకోరని, కనీసం చూడరని, ఒకవేళ చూసినా కూడా పట్టించుకోనట్టు వెళ్లిపోతారని ఆయన అన్నారు.
ఇకపోతే సుకుమార్ తన దగ్గర క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేశారని ఆయన తెలిపారు. ఫస్ట్ సినిమా కూడా అదేనని ఆయన స్పష్టం చేశారు. నిజానికి రైటర్ అవ్వాలని సుకుమార్ వచ్చారని, కానీ షూటింగ్ రేపనగా ఎడిటర్ మోహన్ గారు వచ్చి ఇతన్ని అప్రెంటిస్‌గా పెట్టుకోమని చెప్పినట్టు ఆయన అన్నారు. అప్పుడు దానికి ఆయన అదేంటి సర్, ఆయన ఎంతో మందికి టీచింగ్ చేసి వచ్చినతను, అప్రెంటిస్ ఏంటి మరి, ఆయనకు వర్త్ ఉందనే కదా రైటర్‌గా చేసేందుకు పెట్టుకున్నారు అని తాను అన్నట్టు ఆయన చెప్పారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు సర్. కాబట్టి దానికి అసిస్టెంటా.. కో-డైరెక్టరా అనే పేర్లు పెట్టొద్దు సర్ అని తాను అన్నాడని ఆయన చెప్పుకొచ్చారు.
సుకుమార్ తనతో క్లోజ్‌గా ఉండేవారని ఆయన తెలిపారు. ఆయన గురించి ప్రత్యేకించి తాను చెప్పాల్సిందేముంది ప్రస్తుతం ఆయన తీసిన సినిమాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఆయన ఎలా పని చేస్తారో అని ఆయన స్పష్టం చేశారు.