నటి రోహిణి గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర నిజాలు.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీ రంగంలో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో బాలనాటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలం చెల్లెలి పాత్రలను పోషించింది. మలయాళం లో ప్రారంభించి తెలుగు తమిళంలో కూడా కథానాయకగా నటించింది.

నటన కొనసాగిస్తూనే డబ్బింగ్ లో కూడా ప్రవేశించింది. ఈమె 1968 లో విశాఖపట్నంలో జన్మించింది. తనకు నాలుగు సంవత్సరాల వయసులో తల్లి చనిపోవడంతో కుటుంబమంతా చెన్నై చేరారు. తండ్రికి సినిమాలలో నటించాలని కోరిక ఉండేది. తండ్రి తో పాటు సినిమా ఆఫీసులో చుట్టూ తిరిగితే యశోద కృష్ణ అనే సినిమాలో బాలనటిగా అవకాశం వచ్చింది.

కొంత కాలం తర్వాత మలయాళం లో కథానాయకగా అవకాశం వచ్చింది. అక్కడే రఘువరన్ తో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. వీరి పరిచయం కాస్త పెరిగి 1996లో వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు సంతానం. తరువాత కొన్ని కారణాలవల్ల 2003 లో విడాకులు తీసుకున్నారు. తర్వాత సినిమాలలో చాలావరకు సినిమాలలో కనిపించలేదు.

1995లో పాలగుమ్మి పద్మరాజు పడవ ప్రమాణం కథ ఆధారంగా దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ సినిమా స్త్రీలో నటించినందుకు గాను ఈమెకు ప్రత్యేక జూరీ అవార్డు సొంతం చేసుకుంది. 1996లో తెలుగులో ఈమె నటించిన స్త్రీ సినిమా ద్వారా ఉత్తమ నటి అవార్డు వచ్చింది కానీ ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. రోహిణి గారు సామాజిక కార్యక్రమాలలో, టీవీ కార్యక్రమాలలో నిమగ్నం అయ్యింది.

చాలాకాలం తర్వాత కమలహాసన్ సినిమా పోతురాజులో ఒక పరిశోధకురాలు పాత్రలో కనిపిస్తుంది. అలా మొదలైంది సినిమాలో నానికి తల్లిగా నటించింది. 2005లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రోహిణి ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంది. తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం తరఫున నిర్మించిన షార్ట్ ఫిలిం కు దర్శకత్వం వహించింది.