పీవీ సింధు బయోగ్రఫీలో కొత్త మలుపులు!?

మనకు భారత మహిళా బ్యాడ్మింటన్‌ లో సైనానెహ్వాల్ మనకు దిక్కు అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా మెరుపులా దూసుకొచ్చింది. మూడేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో భారత ఖాతాలోకి రజతాన్ని చేర్చటంతో పీవీ సింధుపై ఫోకస్ పెరిగింది. ఆ సమయం లోనే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ లేడీ షట్లర్ జీవిత కథని తెరకెక్కించాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ తరువాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు
మరో రెండు రజతాలు వరుసగా సాధించటంతో కథలో క్లైమాక్స్ మార్చుకున్నారు.

మూడేళ్లు నడిపించిన స్క్రిప్ట్‌ను లాక్ చేస్తోన్న తరుణంలో తాజాగా పసిడి పతకాన్ని సాధించటం కథకు కొత్త ట్విస్ట్. తాజా రికార్డునే క్లైమాక్స్ చేయనున్నట్టు సోనూసూద్ చెబుతున్నా క్లైమాక్స్‌ను ఉత్కంఠగా చూపించటం కష్టం కావొచ్చన్న ఆలోచన చిత్రబృందాన్ని వెంటాడుతోంది. సింధు వేగాన్ని చూస్తుంటే వచ్చే ఒలింపిక్స్‌లో పసిడి కొల్లగొట్టడం ఖాయమన్న పరిస్థితీ లేకపోలేదు. అందువల్ల ఒలింపిక్స్ ముగిసే వరకూ సింధు స్క్రిప్ట్‌ను లాక్‌చేసే అవకాశమే లేదన్నది తాజా మాట.