పిక్ టాక్: గుబులు రేపుతున్న ఊర్వ‌శి

పిక్ టాక్: గుబులు రేపుతున్న ఊర్వ‌శి

అందానికి అందం ప్ర‌తిభ ఉన్న న‌టి ఊర్వ‌శి రౌతేలా. క్యాట్ వాక్ మోడ‌ల్ అయినా ఊర్వ‌శి గ‌ట్సీ పెర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెర నుంచి వ‌చ్చి వేగంగా ఎదిగేస్తున్న నాయిక‌గా పేరు తెచ్చుకుంటోంది. గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ.. హేట్ స్టోరి 4 లాంటి చిత్రాల్లో ప్రామిస్సింగ్ న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన ఈ బ్యూటీ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. అక్క‌డ వేడెక్కించే ఫోటోల‌తో అంత‌కంత‌కు అగ్గి రాజేస్తోంది.

తాజాగా ఈ సిరీస్ లో కొత్త బికినీ ఫోటో యూత్ లో వైర‌ల్ గా మారింది. నిరంత‌రం ఈ అమ్మ‌డు ఇన్ స్టాలో వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. అయితే ఊర్వ‌శి మ‌రీ ఇంత‌గా చెల‌రేగిపోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది? అంటే.. ఇటీవ‌ల ఈ అమ్మ‌డికి సౌత్ లో విరివిగా ఆఫర్లు వ‌చ్చి ప‌డుతున్నాయిట‌. చిరంజీవి.. చ‌ర‌ణ్ .. ర‌వితేజ స‌హా ప‌లువురు స్టార్ల చూపు ఈ అమ్మ‌డిపై ప‌డ‌డంతో ఇప్ప‌టికే కాల్స్ వెళ్లాయ‌ని చెప్పుకుంటున్నారు. ఇటు తెలుగు అటు త‌మిళం రెండు చోట్లా ఆఫ‌ర్లు వ‌చ్చి ప‌డుతున్నాయ‌ట‌. అయితే క‌రోనా క‌ల్లోలం వ‌ల్ల ఏదీ ఫైన‌ల్ అప్ డేట్ రివీల్ కావ‌డం లేదు.