ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న భామ నయనతార. అన్ని భాషల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న నయన్ ఇటీవలె సైరా చిత్రంతో తిరిగి తెలుగు ప్రేక్షకులకు కనిపించింది. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. అది ఎలా ఉంటే నయన్ జీ తమిళ్ ఫేవరేట్ హీరోయిన్ ఫర్ విశ్వాసం, బిగిల్ అవార్డ్‌ను గెలుచుకుంది. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నయన్ బయటికి ఎంత బోల్డ్‌గా కనిపించినా మనసు మాత్రం చాలా సున్నితం. అందుకే ప్రపంచంలోనే తనకు ఇష్టమైన వ్యక్తి కోసం నయన్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ వ్యక్తి తన బాయ్‌ఫ్రెండ్ అయిన విఘ్నేష్ శివన్ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ వ్యక్తి నయన్ అన్న కూతురు ఏంజిలినా. అవును, మేనకోడలు ఏంజిలినా అంటే నయన్‌కు ప్రాణం అట. అంతేకాదు నయన్ జీవితంలో ఏంజిలినా లక్కీ చార్మ్.
ఎందుకంటే ఏంజిలినా పుట్టిన తర్వాతే నయన్‌కు అన్నీ కలిసొచ్చాయి. ప్రతీ క్రిస్మస్ పండుగను నయన్ తన మేనకోడలితోనే జరుపుకునేవారు. కానీ 2019లో మాత్రం ఏంజిలినా వద్ద నయన్ ఉండలేకపోయారట. ఇటీవలె జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నయన్ వెల్లడించారు. ఆ సమయంలో నయన్.. తన ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి న్యూయార్క్ వెళ్లారు. ఏంజిలినా పక్కన లేనందుకు నయన్ దాదాపు గంట సేపు వెక్కి వెక్కి ఏడ్చారట. దీనిని బట్టే అర్థమవుతోంది నయన్‌ది ఎంత సున్నితమైన మనసో.
ఇటీవలె విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ జంటగా `దర్బార్` చిత్రంలో నటించారు. సీనియర్ హీరోలకు హీరోయిన్ అంటే ముందుగా గుర్తువచ్చేది నయన్. అయితే ఈ చిత్రం కలెక్షన్లు దూసుకుపోతున్నాయి.