నాని గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్ విడుదల

నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ చిత్రం ఈ నెల 13 న విడుదల కానుంది. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్యుండగా ఇతర ముఖ్య పాత్రల్లో లక్ష్మి, శరణ్య మొదలైన వారు నటిస్తున్నారు. సినిమా విడుదల దగ్గరైనందువల్ల సినిమా ప్రచారం జోరు మీద ఉంది. తాజాగా విడుదల అయిన సినిమా ప్రీ లుక్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.

ఇక నిన్న నాని మరో ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. `సీను సిరిగి..సీటులిరిగి..సీటీ కొట్టాలోయి’ అంటూ సాగే సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో RX100 ఫేమ్ కార్తికేయ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవి చందర్.