మణిరత్నం అంటే ఒక పర్ఫెక్షన్. ఆయన సినిమాలు తీసే విధానమే భిన్నంగా ఉంటుంది. అదే ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే ఆయన ఈసారి ఓటీటీ ద్వారా ప్రయోగం చేస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిదిమంది నటులతో తొమ్మిది కథలను తీసుకుని వెబ్ సిరీస్ చేస్తున్నారు ఆయన. ఈ వెబ్ సిరీస్ కు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సిరీస్ ఉండనుంది.
హాస్యం, భయనకం, శృంగారం, రౌద్రం లాంటి తొమ్మిది రసాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్లో ఉండే తొమ్మిది కథలు రూపొందుతున్నాయి. కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, కార్తిక్ సుబ్బరాజ్, పొన్‌రామ్, హలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్, బిజో నంబియార్, అరవింద్ స్వామి, సిద్దార్థ్ తొమ్మిది ఎపిసోడ్లకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ తొమ్మిది కథల్లో రేవతి, సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ, అరవిందస్వామి, నిత్యామీనన్, ఐశ్వర్యారాజేష్, రిత్విక, పూర్ణ, ప్రకాశ్‌రాజ్, బాబీసింహ, జై, స్నేహ లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఏ. ఆర్ రెహమాన్, గోవింద్ వసంతన్, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు టీమ్. నటీనటులంతా నవరసాలను పలికిస్తూ స్లోమోషన్లో కట్ చేసిన టీజర్ బాగా ఆకట్టుకుంది. ఇక రహమాన్ సంగీతం అయితే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 9వ తేదీన నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కానుంది. మణిరత్నం అభిమానులే కాదు చాలామంది సినీ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.