శివానీ రాజ‌శేఖ‌ర్ డెబ్యూ లుక్ ఎన్నాళ్ల‌కు

వెన్నెల‌మ్మ‌ను చూసి కంగారు ప‌డ‌కండి!

క‌థానాయిక అవ్వ‌డం అన్న‌ది ఫేట్. దానిని నిర్ణ‌యించేది పైవాడు. అందుకేనేమో జీవిత‌-రాజ‌శేఖ‌ర్ జంట గారాల కుమార్తె శివానీ రాజ‌శేఖ‌ర్ సినీఎంట్రీ అనుకున్నంత సాఫీగా ఏమీ జ‌ర‌గ‌లేదు. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన చందంగా న‌టించిన తొలి సినిమా మిడిల్ డ్రాప్ అవ్వ‌డం ఇబ్బంది పెట్టింది. అడివి శేష్ తో 2 స్టేట్స్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. 

అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుని కుమార్తెలా శివానీ మాత్రం డెబ్యూ మూవీ కోసం ఎంతో క‌సిగా వ‌ర్క్ చేసింద‌ట‌. ఎట్ట‌కేల‌కు డెబ్యూ లుక్ ఇన్ స్టాలోకి వ‌చ్చేసింది. యంగ్ స్టార్లెట్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రంలో శివానీ పాత్ర పేరు వెన్నెల. ఇది ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. ఫాంటసీ ట‌చ్ తో పాటు కొత్త లోకంలోకి వెన్నెల‌మ్మ‌లా ప్ర‌వేశించిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ అవతారం‌లో శివానీ అందంగా కనిపిస్తోంది. అయితే మ‌రీ అలా మేడ‌పై గోడ అంచుమీద కూచుని జాబిల‌మ్మ‌తో ప‌రాచికం ఆడుతుంటేనే కుర్రాళ్ల‌కు కాస్త కంగారుగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించిన తేజా సజ్జా ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.

ప్రముఖ వెబ్-సిరీస్ `పెళ్లిగోల‌`కు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్- మహతేజా క్రియేషన్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. షూటింగ్ వివ‌రాలు స‌హా తారాగణం ఎవ‌రు? సాంకేతిక నిపుణులు ఎవ‌రెవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది.