విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ఇది రీమేక్. వెంకీ ఏరి కోరి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. మేకోవర్ నుండి సన్నివేశాల్లో పెర్ఫెక్షన్ వరకూ ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నారు. ఫస్ట్ లుక్ చూసి అభిమానులు థ్రిల్ ఫీలయ్యారు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావించారు. నారప్పగా వెంకీ నటనను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని అనుకున్నారు సురేష్ బాబు.
అనుకున్నదే తడవుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో డీల్ మాట్లాడేశారు. కానీ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. అంతమంచి సినిమాను థియేటర్లలో కదా చూడాల్సింది, ఓటీటీకి ఇవ్వొద్దు, ఇస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు. అభిమానుల ఒత్తిడితో సురేష్ బాబు కాస్త తగ్గినట్టే కనబడ్డారు. థియేటర్లలోనే సినిమా అంటూ సురేష్ కాంపౌండ్ నుండి లీక్స్ మొదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ కుదుటపడ్డారు. కానీ ఇప్పుడు మళ్లీ సురేష్ బాబు మొదటికే వచ్చారు. చిత్రాన్ని అమెజాన్ ద్వారా రిలీజ్ చేయాలని ఫైనల్ చేశారు. జూలై ఆఖరి వారంలో సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుందట. సో.. వెంకీ అభిమానులకు ‘నారప్ప’ను బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశం లేనట్