చేసింది ఒక్క చిత్రమే కానీ కర్రుకారు మనసు దోచేసింది.. మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో మ్యాక్సిమమ్ పెర్పార్మెన్స్‌తో మెస్మరైజ్ చేసింది.. క్లాస్ లుక్‌లో మాస్ ఆడియన్స్‌కు సైతం కలల రాణిగా మారింది.. ఆమె ఎవరో కాదు ప్రియాంక అరుల్. ఇంకా గుర్తు రాలేదా.. నానీస్ గ్యాంగ్స్ లీడర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మరో మాలీవుడ్ ముద్దుగుమ్మే ప్రియాంక. టాలీవుడ్‌లో మలయాళీ హీరోయిన్‌ల హవా కొనసాగుతున్న తరుణంలోనే మరో మాలీవుడ్ హీరోయిన్‌ను తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించింది. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, సాయి పల్లవి వంటి మనసు దోచిన హీరోయిన్ల జాబితాలో ప్రియాంక చేరింది.
అయితే చేసింది ఒక్క చిత్రమే అయినప్పటికీ అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో నానీస్ గ్యాంగ్ లీడర్ హీరోయిన్‌కు వరుస అవకాశాలు, స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే. ఈ అమ్మడికి నాని చిత్రం తర్వాత మరో సినిమా అవకాశం ఇప్పటివరకు రాలేదు. మరే చిత్రానికి సైన్ కూడా చేయలేదు. అయితే టాలీవుడ్ సర్కిళ్లలో తిరుగుతున్న సమాచారం ప్రకారం ప్రియాంకకు భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్వకత్వంలో ‘కార్తికేయ 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. పురాతన దేవాలయాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రియాంక నటించే అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో నటించే అవకాశం తొలుత అనుపమ పరమేశ్వరన్‌కు వచ్చినప్పటికీ మూవీ మేకర్స్ తమ మనసు మార్చుకున్నారట. అనుపమ కంటే ప్రియాంక అయితే బెటర్ అనుకోవడంతో ఆమెనే ఫైనల్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అటు హీరోయిన్ సైడ్ నుంచి గానీ మూవీ మేకర్స్ నుంచి గాని ఎలాంటి రియాక్షన్ రాలేదు. అయితే త్వరలోనే అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.