బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత సినిమా రంగానికి అందులోని మనుషులకి సరిపోతుంది. ఒక్క ప్లాప్ వస్తే అంతవరకు ఉన్నా స్టార్డమ్ అంతా ఎగిరిపోతుంది. ‘మహర్షి’ సినిమాకి సంగీతం పరంగా విమర్శలను ఎదుర్కొన్న దేవిశ్రీ కి ఆ తరువాత పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి.
ఒకప్పుడు అతను లేని స్టార్ హీరో సినిమా ఉండేది కాదు. మరీ ఎక్కువగా మెగా హీరోల సినిమా అంటే అందులో దేవి శ్రీ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాజాగా చిరు-కొరటాల శివ చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రంలో కూడా దేవిశ్రీ ఉండేది అనుమానమే. ఖరారు అయితే ఆయా రోజే చెప్పేవారు కానీ చెప్పకుండా దాచి ఉంచారు. మరో పక్క కొరటాల శివ చిత్రాలన్నిటికీ దేవిశ్రీ పని చేసాడు. మరి కొరటాల ఏమనుకుంటున్నాడో తెలియాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే.