మహేష్ కెమెరా మెన్ కొంప ముంచిన  ట్వీట్

మహేష్ బాబు …స్పైడర్ చిత్రానికి ఛాయాగ్రాహకుడుగా పనిచేసిన సంతోష్ శివన్ ఇప్పుడు ఓ ట్వీట్ తో ఇరుకున పడ్డారు. ఆయన తమని కామెంట్స్ చేసారంటూ నిర్మాతల మండలి సీరియస్ అవుతోంది.  సినీ నిర్మాతస ప్రవర్తనను ఓ కుక్క మెమెతో పోల్చుతూ ట్వీట్ చేశాడు.

 హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు ప్రేమగా ఉండే నిర్మాతలు, సినిమా టెక్నీషియన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇబ్బందిపడుతూ ఇస్తూంటారు అనే  అర్ధం వచ్చేలా ఓ మెమెను పోస్ట్ చేశాడు. దీనిపై సినిమా నిర్మాతలు సీరియస్ అయిపోయారు.తమని ఇలా అంటారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఆ మెమోని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ మెమెలో ‘హీరోయిన్ కు రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు నిర్మాతలు’ అనే క్యాప్షన్ కింద ప్రేమతో ఉన్న కుక్క ఫొటోను, ‘టెక్నీషియన్స్ కు నగదును ఇచ్చేటప్పుడు నిర్మాతలు’ అనే క్యాప్షన్ కింద మరో కోపంతో ఉన్న కుక్క ఫొటోను మిక్స్ చేసిన మెమెను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు.

 ఈ మెమో తో పలువురు నిర్మాతలు సంతోష్ పై తమిళ సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అప్రమత్తమైన శివన్ ట్వీట్ ను డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయమై ఈరోజు సమావేశం కానున్న నిర్మాతల మండలి సంతోష్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనుంది. అదీ సంగతి.