మద్రాస్ కోర్టులో కేసు.. రామ్ చరణ్ సినిమా ఆగిపోతుంది

Ram Charan, Shankar project ,
Ram Charan, Shankar project ,
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి సినిమాను తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓకే చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ భారీ బడ్జెట్ సినిమాను దిల్ రాజు నిర్మాత.  ‘ఆర్ఆర్ఆర్’ పూర్తవగానే ఈ సినిమా మొదలుకావాల్సి ఉంది.  కానీ ఇప్పుడు చూస్తే మొదలవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  అందుకు కారణం ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్.  నిజానికి శంకర్ ఆ సినిమాను మధ్యలోనే వదిలేసి చరణ్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.  లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తోంది.  సాఫీగానే మొదలైన ‘ఇండియన్ 2’ సినిమా పారితోషకం విషయంలో వచ్చిన గొడవల కారణంగా ఆగింది.  ఆ తరవాత బడ్జెట్ సమస్యలు కూడ వచ్చాయి.  
 
శంకర్ అడిగినంత ఖర్చు చేయడానికి నిర్మాతలు ఒప్పుకోలేదు.  ఆ తర్వాత సెట్లో ప్రమాదం జరిగింది.  ఇలా వరుస సమస్యలతో ప్రాజెక్ట్ అటకెక్కింది.  దీంతో శంకర్ చరణ్ సినిమాకు ఒప్పుకున్నారు.  కానీ ఇప్పుడు లైకా సంస్థ కోర్టుకెళ్లింది.  ఇంతవరకు సినిమా మీద 180 కోట్లు ఖర్చు చేశామని, శంకర్ కు ఇస్తామన్న 40 కోట్లలో ఇప్పటికే 14 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చామని మిగతాది కోర్టులో డిపాజిట్ చేస్తామని, శంకర్ ను తమ సినిమా పూర్తి చేయకుండా వేరే సినిమాకు వెళ్లకుండా ఆపాలని పిటిషన్ వేసింది.  అయితే కోర్టు శంకర్ వాదన విన్నాకే తీర్పు ఇస్తామంటూ వాదన వినిపించాలని శంకర్ కు నోటీసులు పంపింది.  ఒకవేళ ఈ కేసులో కోర్టు ‘ఇండియన్ 2’ పూర్తయ్యాకే శంకర్ వేరే సినిమా చేయాలని తీర్పు ఇస్తే మాత్రం చరణ్ సినిమా ఆగినట్టే.