దేవరకొండ, పూరి పనిలో దిగిపోయారుగా !

దేవరకొండ, పూరి కలిసి ఏం చేస్తున్నారో చూడండి…

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్..ఇద్దరూ ఫెరఫెక్ట్ కాంబినేషన్. రెగ్యులర్ గా సినిమాకు వెళ్లేవారికి వీళ్లద్దరి యూటిట్యూట్ పరిచయమే. క్యారక్టరైజేషన్ తో నే సినిమాని నిలబెట్టే వీళ్లద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. ఎలాంటి సినిమా రాబోతుందీ అనేది ఆసక్తికరమే.

వరస ఫెయిల్యూర్ లో ఉన్న పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. రామ్ హీరోగా నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. కాగా పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఈమేరకు వీళ్ళద్దరు కలిసి లొకేషన్స్ స్కౌటింగ్ మొదలెట్టేసారు. హైదరాబాద్ సిటీలోకల్ లోనే షూటింగ్ ఉండబోతోందని తెలుస్తోంది.

<

p style=”text-align: justify”>ఇక వీళ్లద్దరి కాంబినేషన్ లో రెడీ అయ్యే ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు.. అలాగే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.