దుల్క‌ర్‌పై త‌మిళ సంఘాల సీరియ‌స్‌!

క్ష‌మించ‌మంటున్న దుల్క‌ర్‌!

మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌పై త‌మిళ సంఘాలు సీరియ‌స్ అవుతున్నాయి. త‌మ ప్రాంత మ‌నో భావాల్ని దెబ్బ‌తీశాడ‌ని, త‌మ‌ని అవ‌మానించ‌డాని దుల్క‌ర్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తూ నిర్మించిన చిత్రం `వ‌రానే అవ‌శ్య‌ముండ్‌`. అనూప్ స‌త్య‌న్ ద‌ర్శకత్వం వ‌హించాడు. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. సురేష్ గోపీ, శోభ‌న కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌లైన ఈ చిత్రంలో ముంబైకి చెందిన ఓ పాత్రికేయుడి ఫొటోని వాడుకుని అత‌న్ని అవ‌మానించార‌ని పెద్ద ర‌చ్చే జ‌రిగింది. దీనిపై స‌ద‌రు పాత్రికేయుడు చిత్ర యూనిట్ై సీరియ‌స్ కావ‌డంతో దుల్క‌ర్ స‌ల్మాన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశంలో త‌మిళుల‌ని అవ‌మానించే విధంగా ఓ స‌న్నివేశం డైలాగ్‌లు వున్నాయ‌ట‌. దీంతో త‌మిళ సంఘాలు దుల్క‌ర్‌పై దుమ్మెత్తిపోయ‌డం మొద‌లుపెట్టాయి. వివాదం మ‌రింత‌గా ముద‌ర‌క‌ముందే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని గ్ర‌హించిన దుల్క‌ర్ ట్విట్ఱ్ వేదిక త‌మిళుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఈ విష‌యాన్ని చాలా మంది త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని, త‌మిళ ప్ర‌జ‌ల్ని అవ‌మానించాల‌ని చేసిన సీన్ కాద‌ని, అనుకోకుండా అలా జ‌రిగిపోయింద‌ని, మ‌ల‌యాళ సినిమా `ప‌ట్ట‌ణ ప్ర‌వేశం`లోని స‌న్నివేశానికి ప్రేర‌ణ‌గానే ఆ సీన్ చేశామ‌ని, ఈ విష‌యంలో మీ మ‌నోభావాల్ని కించ‌ప‌రిచి వుంటే క్ష‌మించ‌మ‌ని కోరుతున్నాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా `ప‌ట్ట‌ణ ప్ర‌వేశం` చిత్రంలోని ఓ సీన్‌ని షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.