లేటెస్ట్ గా తెలుగు సినిమా దగ్గర నుంచి వచ్చి సత్తా చాటుతున్న బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో మోలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం “సీతా రామం” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అంత విషయం ఉందా అని రిలీజ్ కి ముందు అనుకున్న వారిని సైతం ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత వండర్స్ నమోదు చేస్తూ వస్తుంది.
అయితే యూఎస్ లో కూడా భారీ వసూళ్లతో అదరగొడుతున్న ఈ సినిమాపై ఇప్పుడు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికర అంశం బయటకి వచ్చింది. ఈ సినిమాలో దుల్కర్ పోషించిన అద్భుతమైన రోల్ రామ్ కి మొదటి ఛాయిస్ తాను కాదట.
దర్శకుడు హను రాఘవపూడి ఈ రోల్ కోసం గాను మన తెలుగు స్టార్ హీరోలు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అలాగే నాచురల్ స్టార్ నాని లను ముందు అడిగాడట దీనితో వారికి ఉన్న కమిట్మెంట్స్ రీత్యా ఈ సినిమా ఓకే అవ్వలేదట. దీనితో ఈ చిత్రం దుల్కర్ కి వచ్చింది.
ఇక సీన్ కట్ చేస్తే భారీ వసూళ్లు లాభాలు ఇవ్వడమే కాకుండా ఈ సినిమా యూనిట్ అందరి కెరీర్ లో కూడా ఒక సూపర్ క్లాసిక్ సినిమాగా ఇది నిలిచిపోయింది. మరి ఇలాంటి హిట్ సినిమాని నాని, రామ్ లు అయితే వదిలేసుకున్నారు.
ఇద్దరిలో ఎవరు చేసిన కూడా మన తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద హిట్ అయ్యి ఉండేదని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ “జెర్సీ” ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇదే దర్శకుడు హను రాఘవపూడితో నాని నుంచి “కృష్ణ గాడి వీర ప్రేమగాథ” అనే హిట్ సినిమా కూడా వచ్చింది.