దసరా కాదు అక్టోబర్లో వస్తున్నా ‘వెంకీ మామ’

నిజ జీవితంలో మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. అసలైతే ఈ సినిమా ఈ ఏడాది దసరాకి విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ షూటింగ్ వాయిదా పడేసరికి విడుదల కూడా వాయిదా పడింది. ఈ చిత్రం మొత్తానికి అక్టోబర్ 25 న విడుదల అవుతున్నట్టు అధికారిక సమాచారం.

ఈ చిత్రంలో రాశి ఖన్నా మరియు పాయల్ రాజపుట్ లు హీరోయిన్లు. కె.ఎస్. రవీంద్ర ఈ చిత్రానికి దర్శకుడు కాగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పెఒప్లె మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.