సాయిధ‌ర‌మ్ తేజ్ వాలెంటైన్ సెలెబ్రేషన్స్ కి దూరం

మెగా కాంపౌండ్ అండ‌.. పైగా మెగా మేన‌ల్లుడు.. ఇలా అన్నీ వున్నా షైన్ కాలేక‌పోతున్నాడు హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్‌. కెరీర్ తొలినాళ్ల‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ త‌రువాత దిల్ రాజు అండ‌తో హీరో అనే ముద్రని స‌క్సెస్‌ఫుల్‌గా వేయించుకున్నాడు. దిల్ రాజు క్యాంప‌స్‌ని వీడి బ‌య‌టికి వ‌చ్చాక మ‌నోడికి ఒక్క హిట్టు సినిమా కూడా ప‌డ‌లేదు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్‌లో చేసిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫర్ సేల్‌, సుప్రిమ్ ఇలా వ‌రుస విజ‌యాల్ని అందించాయి. ఆ త‌రువాతే అస‌లు ప‌రీక్ష మొద‌లైంది.

ఆ త‌రువాత చేసిన ఆరు చిత్రాలు అడ్ర‌స్ లేకుండా పోయాయి. సాయిధ‌ర‌మ్‌తేజ్ ప‌రిస్థితి ఇక ఇంతేనా అనేలా వాతావ‌ర‌ణం క్రియేట్ అయ్యింది. ఆ స‌మ‌యంలో కిషోర్ తిరుమ‌ల చేసిన చిత్ర ల‌హ‌రి, మారుతితో చేసిన `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రాలు వ‌రుస విజ‌యాల్ని అందించి సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌కి మ‌ళ్లీ కొత్త ఊపిరిని పోశాయి. ఈ స‌క్సెల‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన ఈ హీరో తాజాగా చేస్తున్న చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ భామ న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ వీడియోని హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రిలీజ్ చేశాడు. `సింగిల్ సోద‌రులారా ఇది మ‌న ఫీలింగ్ .. మిగ‌తా వారు వాలెంటైన్స్ డేని సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు. అంటూ ట్వీట్ చేశాడు. థీమ్ వీడియోలో పెళ్లికాని ఆర్. నారాయ‌ణ‌మూర్తి ద‌గ్గ‌రి నుంచి అబ్దుల్ కలాం వ‌ర‌కు చూపించారు. సినిమాలో హీరో SSB Clubకి అధ్య‌క్షుడిలా క‌నిపిస్తున్నాడు. సినిమా టేకింగ్‌, మేకింగ్‌, సాయిధ‌రమ్‌తేజ్ క్యారెక్ట‌ర్‌ని మ‌లిచిన తీరు చూస్తుంటే మ‌ళ్లీ హిట్ కొట్టేలాగే క‌నిపిస్తున్నాడు. ఇక‌పై కూడా ఇదే పంథాలో వెళితే సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్ బెట‌ర్‌గా వుంటుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Solo Brathuke So Better Theme Video | Sai Tej | Nabha Natesh | Subbu | Thaman S | SVCC