టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన చిత్రం “బ్రో ది అవతార్”. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రముఖ నటుడు సముద్రఖని అయితే తెరకెక్కించారు. అయితే ఇది రీమేక్ సినిమా అయినప్పయికీ ఎలా లేదన్నా 70 కోట్లకి పైగా షేర్ ని రాబట్టేసింది.
దీనితో పవన్ సహా సాయి ధరమ్ తేజ్ ల కెరీర్ లో మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో కంటెంట్ కి ఇది ఎక్కువే అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఆల్రెడీ థియేటర్స్ లో రన్ కూడా కంప్లీట్ చేసేసుకుంది. మరి నెక్స్ట్ మిగిలి ఉంది సినిమా ఓటిటి రిలీజ్ ఒక్కటే కాగా..
ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై ఇప్పుడు బిగ్ అప్డేట్ వచ్చింది. కాగా ఈ చిత్రం ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఇందులో స్ట్రీమింగ్ డేట్ కి ఈ చిత్రం ఇప్పుడు లాక్ చేసుకుంది. కాగా ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఈ ఆగస్ట్ 25 నుంచే అందుబాటులో ఉండనున్నట్టుగా ఫిక్స్ అయ్యింది.
దీనితో బ్రో కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదో గుడ్ న్యూస్ అని చెప్పొచు. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందించగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు కూడా నటించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణం వహించారు.
Telugu Film #Bro Will Premiere On August 25th On Netflix pic.twitter.com/P1GPcSCdxh
— Cinema World (@cinemaa_world) August 20, 2023