అంత చేసినా “బ్రో” కి వచ్చిన రేటింగ్ ఇదే..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన చిత్రం “బ్రో ది అవతార్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోగా సాయి ధరమ్ తేజ్ నటించగా గ్లామరస్ బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో నటించింది. అలాగే ఈ చిత్రాన్ని తమిళ ప్రముఖ దర్శకుడు సముద్రఖని అయితే దర్శకత్వం వహించారు.

మరి ఈ చిత్రం మరీ అంత గొప్పగా ఏమీ వసూళ్లు రాబట్టేయలేదు కానీ ఓకే అనిపించే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేసింది. ఇకవేళ పవన్ కూడా లేకపోతె వచ్చే వసూళ్లు కూడా కష్టం అని చెప్పొచ్చు. ఇక థియేటర్స్ లో రిలీజ్ తర్వాత బుల్లితెరపై రిలీజ్ కి మాత్రం టెలికాస్ట్ ఛానెల్ జీ తెలుగు వారు ఆఫ్ లైన్ లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నే చేశారు.

కానీ ఈ చిత్రానికి మాత్రం అనూహ్యంగా షాకింగ్ టీఆర్పీ రేటింగ్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. కాగా ఇవాళ వచ్చిన బార్క్ రిపోర్ట్స్ ప్రకారం బ్రో సినిమా కేవలం 7.24 రేటింగ్ మాత్రమే వచ్చిందట. ఓ బిగ్ స్టార్ అందులోని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న సినిమా అయినప్పటికీ పైగా మొట్ట మొదటిసారి టెలికాస్ట్ అయినప్పటికీ ఈ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్ రావడం షాకింగ్ అని చెప్పాలి.

అయితే ఇది మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కి కొత్తేమి కాదు రీసెంట్ గా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట కి కూడా ఇదే పరిస్థితి. మొత్తానికి అయితే బ్రో బుల్లితెర మీద కూడా జస్ట్ ఓకే అనిపించుకున్నాడని చెప్పాలి. ఇంకా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు.