తన గురువు మాండొలిన్ శ్రీనివాస్ కోసం దేవిశ్రీ ప్రత్యేక ప్రదర్శన

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్నేళ్ల పాటు సంగీత దర్శకుడిగా కొనసాగుతూ ఇంకా ఎన్నో మంచి పాటలను స్వరపరచిన సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా తన గురువు మాండొలిన్ శ్రీనివాస్ ను గుర్తుచేసుకుంటూ ‘దేవ దేవం’ అనే పాటను వేదిక పై ప్రత్యేక ప్రదర్శన చేసి త‌న గురువు మాండొలిన్ శ్రీనివాస్‌కు అంకితమిచ్చారు.

ఆ పాటను దర్శకుడు సుకుమార్, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “గురువు గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం. అందుకే నా గురువు మాండొలిన్ శ్రీనివాస్‌గారికి ఇష్టమైన కీరవాణి రాగంలో ఓ పాటను స్వర పరిచాను. మీ అందరికి కూడా ఆ పాటంటే చాలా ఇష్టమే. మా గురువుగారితో పాటు జీవితాలకు అర్ధం నేర్పే ప్రతి గురువుకి ఈ పాట అంకితం” అన్నారు.