సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఆ రంగులకు తగ్గట్టే ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. పొగిడిన వాళ్లే ఇక్కడ తిడుతుంటారు. హిట్టు పడిందా నీ అంతటి మగాడు, నీ అంతటి డైరెక్టర్ లేడంటారు. అదే ఒక్కసారి ఫ్లాప్ పడిందా? ఇక చుక్కలు చూడాల్సిందే. ఇదే పరిస్థితిన స్టైలిష్ డైరెక్టర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఇటీవల సీనయిర్ హీరోతో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని అందించిచమేకింగ్, టేకింగ్ పరంగా శభాష్ అనిపించుకున్న దర్శకుడికి సదరు సినిమా నిర్మాత, స్టార్ హీరో చుక్కలు చూపిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
స్వాతంత్య్ర సమరయోధుడి కథగా ఓ సినిమా ఇటీవల తెరపై కొచ్చింది. దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీర్చి దిద్దడంతో దర్శకుడు చాలానే శ్రమించారు. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి పారితోషికం కింది 8 కోట్లిస్తానని సదరు చిత్ర నిర్మాత, స్టార్ హీరో ప్రామిస్ చేశాడట. 2 కోట్లు ఇచ్చి సినిమా ఫ్లాప్ కావడంతో బ్యాలెన్స్ 6 కోట్లు ఇవ్వకుండా దర్శకుడికి చుక్కలు చూపిస్తున్నాడట. ఈ విషయంలో ఎంత ప్రయత్నించినా హీరో నుంచిస్పందన లేకపోవడంతో దర్శకుడు రోడ్డెక్కి రచ్చ చేసేందకు రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదే జరిగితే స్టార్ హీరో, ఆయన ఫాదర్ పవరువు బజారున పడ్డట్టే అంటున్నారు.