Swayambhu: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న నిఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చే ప్రత్యేకమైన సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. నిఖిల్ చివరగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడో మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు నిఖిల్. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభు. పీరియాడికల్ సబ్జెక్టుతో నిర్మిస్తున్న ఈ సినిమా చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లను విడుదల చేయలేదు మూవీ మేకర్స్. కానీ ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా చివరి దశకు వచ్చేసినట్టు ఉంది. ఈ క్రమంలోనే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే త్వరలో టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బాహుబలి తరహా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ని విడుదల చేశారు.
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో నిఖిల్ తో పాటు సంయుక్త కూడా కత్తి పట్టుకుని కదన రంగంలో ఉన్నట్లు కనిపించింది. మరి మూవీ ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు రానున్నట్టు తెలుస్తోంది. కాగా హీరో నిఖిల్ కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విడుదలైన సినిమాలన్నీ కూడా వరుసగా హిట్ గా నిలిచాయి. ఈ సినిమా తర్వాత స్పై, 18 పేజీస్, అప్పుడు ఇప్పుడు వంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఆశలన్నీ కూడా స్వయంభు సినిమా మీద పెట్టుకున్నారు హీరో నిఖిల్. మరి ఈ సినిమా నిఖిల్ కు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి..