శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన భారీ చిత్రం కుబేర.. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పట్ల భారీ అంచనాలుండగా.. తొలి రోజే ఆ అంచనాలను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹30 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. హౌస్‌ఫుల్ షోలదో దూసుకు పోయింది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 12 నుంచి రూ.13 కోట్లు వసూలయ్యాయని సమాచారం.
ఇక తమిళనాడులో తొలుత బుకింగ్స్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ… పాజిటివ్ టాక్‌తో షోకు షో కలెక్షన్లు పెరిగాయి. అక్కడ రూ. 5 కోట్లకు చేరిన గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి రూ.3 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్‌లో కుబేరకి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రూ. 3.5 కోట్లు వసూలు చేసింది. అందులో తెలుగు వెర్షన్ నుంచి ఎక్కువ ఆదాయం వచ్చింది.
మొత్తంగా ఇండియాలోని డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా రూ. 26 కోట్ల గ్రాస్ మార్క్ చేరినట్లు అంచనా. అన్ని ప్రాంతాల్లో కలిపితే తొలిరోజు గ్రాండ్ టోటల్ రూ.30 కోట్ల గ్రాస్ నమోదు అయ్యింది. నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌కు తోడు శేఖర్ కమ్ముల దర్శకత్వంపై ఉన్న నమ్మకం సినిమా ఓపెనింగ్స్‌ను భారీగా మార్చింది. ఇప్పుడు వీకెండ్ దిశగా అడుగులు వేస్తున్న కుబేర, పాజిటివ్ టాక్‌తో మరింతగా వసూళ్లు పెంచే అవకాశాలున్నాయి.
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఇదే జోరు కొనసాగితే, ఇది నాగార్జున, ధనుష్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలవనుంది. ఖచ్చితమైన లెక్కలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ట్రేడ్ సర్కిల్స్ అంచనాల ప్రకారం, కుబేర తొలిరోజే విజయం వైపు బలంగా అడుగులు వేసినట్టు స్పష్టమవుతోంది.