జులై 21 న అనుష్క ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్

‘భాగమతి’ హిట్టయినా అనుష్క మళ్ళీ మరో సినిమాతో తెర పైకి రాలేదు. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ అంటూ మన ముందుకు వస్తోంది. టాలీవుడ్ లో థ్రిల్లర్ల హవా నడుస్తోంది. ఇది కూడా మరో థ్రిల్లర్ సినిమానే. ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. అనుష్క పరిశ్రమకు వచ్చి 14 ఏళ్ళు పూర్తి అయినా సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జులై 14 న విడుదల చేస్తున్నారు నిర్మాతలు.
ఈ సినిమాకు హేమంత మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అధిక భాగం షూటింగ్ అమెరికా లో జరుపుకుంది. ఈ సినిమాలో ఇంకా శ్రీనివాస్ అవసరాల, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు మొదలైన వారు ఉన్నారు.