జాన్ అబ్రహం సరసన కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ తెలుగు తెర పై మెరిసి దశాబ్ద కాలం దాటగా అటు హిందీలోనూ సినిమాలు చేస్తూ కెరీర్ విస్తరించుకుంటోంది. ఆ మధ్య హిందీలో సినిమాలు చేసినా అవి ప్లాప్ అయ్యి మళ్ళీ తెలుగు వైపే చూస్తోంది. ఆమెకు ఇక్కడ కూడా అవకాశాలకు ఢోకా లేదు కానీ విజయమే వరించి చాలా కాలం అయింది. అయినా సరే అప్పుడప్పుడు తెలుగు నాట కనిపిస్తూనే ఉంది.

తాజాగా ఆమెకు హిందీలో జాన్ అబ్రహాం సరసన నటించే అవకాశం వచ్చింది. ఇక్కడ మెలికేంటంటే ఆమెకు తెలుగు నాట సినిమాకు తీసుకునే మొత్తం కంటే కూడా అక్కడ ఆ సినిమాకి ఇచ్చేది తక్కువే. కానీ ఆ సినిమా, అందులో తన పాత్ర తెగ నచ్చేసి రెమ్యూనరేషన్ కూడా పట్టించుకోకుండా సరే అందట. విన్నారా దర్శకనిర్మాతలు కథ, పాత్ర నచ్చితే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటుందట!