SSMB29: రాజమౌళి న్యూ ప్లాన్.. లోకేషన్ లెక్కలు బయటకివచ్చినట్టే!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న SSMB 29 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మావెరిక్ డైరెక్టర్ రాజమౌళి.. ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్‌లో రూపొందించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి షూటింగ్ లొకేషన్స్ గురించి తాజాగా ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది.

ఇప్పటివరకు జరిగిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ బాబు ప్రధాన షెడ్యూల్స్ కోసం తన పాస్ పోర్ట్ కూడా రెడీ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ఇప్పటికే కొన్ని దేశాల్లో లొకేషన్లను లాక్ చేశారని, ముఖ్యంగా అమెజాన్ అడవులు, ఆఫ్రికన్ సఫారీలు ప్రధానగా ఈ సినిమాలోని కీలక భాగంగా మారనున్నాయనే టాక్ వినిపిస్తోంది.

అయితే, ముందుగా షూటింగ్ కోసం ఎంచుకున్న రామోజీ ఫిల్మ్ సిటీలో కాకుండా, హైదరాబాద్‌ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, రెండు మూడు లొకేషన్లను కూడా టీమ్ ఫైనల్ చేసిందని, ప్రీ షూట్ కోసం కొన్ని టెస్టింగ్ షాట్స్ కూడా తీసినట్లు సమాచారం.

గతంలో రాజమౌళి ‘RRR’ లో కూడా అల్యూమినియం ఫ్యాక్టరీని ఎక్కువగా ఉపయోగించారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా అక్కడే మొదలు పెట్టడంపై ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అంతేకాదు, ఈ మూవీ కోసం యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా డిజైన్ చేస్తున్నారని, హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా జాయిన్ అవుతున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ నటుడు జాన్ అబ్రహాం, మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌లను కూడా బోర్డింగ్‌లోకి తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లోకేష్ ను లీడర్ చేసిందే జగన్|| Senior Journalist Lalith Kumar Analysis On Nara Lokesh Politics || TR