Meenakshi Chowdary: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున అందరికీ మీనాక్షి చౌదరి పేరు గుర్తుకొస్తుంది ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ వరుసహిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న మీనాక్షి చౌదరి ఇటీవల తెలుగులో సంక్రాంతి వస్తున్నాం సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా వరుస హిట్ సినిమాలలో నటిస్తూ తెలుగులో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందని సమాచారం.
ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా విషయంలో చర్చలు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే ఈమె సినిమా షూటింగ్ పనులలో భాగం కాబోతున్నారని సమాచారం. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి జాన్ అబ్రహం సినిమాలో ఛాన్స్ కొట్టేసారని తెలుస్తోంది. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో ఫోర్స్ 3 సినిమాలో కథానాయక ఈమె ఎంపిక అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చర్చలు ముగిసాయని త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.
మీనాక్షి చౌదరి ఇచట వాహనములు నిలపరాదనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం తెలుగులో గుంటూరు కారం లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. మరి తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ వస్తుందో తెలియాల్సి ఉంది.
