Genelia: ఆ హీరోతో సినిమా సెట్ లో పెళ్లి.. 14 ఏళ్ల తర్వాత స్పందించిన హీరోయిన్!

Genelia: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా ఆ తర్వాత కాలంలో సినిమాలకు కాస్త దూరమైన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ జెనిలియా బాలీవుడ్ కి చెందిన ఒక నటుడితో సినిమా షూటింగ్లో తన పెళ్లి జరిగింది అంటూ కొన్ని క్రితం జరిగిన ప్రచారంపై స్పందించారు.

దాదాపు ఆ విషయం గురించి 14 ఏళ్ల తర్వాత చర్చించడం ఆశ్చర్య పోవాల్సిన విషయం. ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ.. బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం, నేను గతంలో ఒక ప్రాజెక్ట్‌ కోసం కలిసి వర్క్‌ చేశాము. ఆ సినిమా సెట్‌ లో అనుకోకుండా మా పెళ్లి జరిగిందంటూ అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగింది. అది కేవలం ప్రచారం మాత్రమే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. మాకు పెళ్లి జరగలేదు. కొంతమంది పీఆర్‌లు ఇలాంటి వార్తలను సృష్టించారు.

కాబట్టి, ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేశారో వారినే అడగండి అని జెనీలియా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా 2011లో విడుదల కాగా దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ విషయం గురించి పంపించింది జెనీలియా. జెనీలియా జాన్‌ అబ్రహం కలిసి వర్క్‌ చేసిన చిత్రం ఫోర్స్‌. 2011 సెప్టెంబర్‌ నెలలో ఇది విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జాన్‌, జెనీలియా వివాహం జరిగిందనే వార్తలు అప్పట్లో తెగ చక్కర్లు కొట్టాయి. సీన్‌ లో భాగంగా పంతులుగారు వీరిద్దరికీ నిజమైన పెళ్లి చేసేశారని పలువురు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో దీని గురించే సినీ ప్రియులు మాట్లాడుకున్నారు. ఆ వార్తలకు చెక్‌ పెడుతూ ఆ తర్వాత ఏడాదిలోనే జెనీలియా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నటుడు, తన స్నేహితుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తో ఆమె వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా ఆమె అడపాదడపా చిత్రాల్లో యాక్ట్‌ చేస్తున్నారు.