తెలుగు ఫిలిం ఛాంబర్ వారు ఈ విషయాన్ని తెలిపారు . ఒకప్పుడు కోటి రూపాయలు లోపు తీసిన వాటిని చిన్న సినిమాలు అనేవారు . ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాణం 100 కోట్లను దాటి పోయింది . అందుకే చిన్న సినిమాలంటే 10 కోట్లతో తీసేవని అంటున్నారు . గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో చిన్న సినిమాలకు రాయతీలు ఉండేవి . ఇప్పుడు రాయతీలు లేవు , ఏమీలేవు . సినిమా అవార్డుల గురించే పట్టించుకోవడం లేదు . ఇక చిన్న సినిమాల గురించి ప్రభుత్వాలకు ఏమి పడుతుంది . బహుశ ఈ విషయాన్ని గుర్తించిన తెలుగు ఫిలిం ఛాంబర్ , ఫిలిం ఫెడరేషన్ సంయుక్తంగా చిన్న సినిమాలకు చేయూత ఇవ్వాలనుకున్నాయి . సినిమా నిర్మాణంలో కార్మికులదే ముఖ్య భూమిక . డైరెక్షన్ , ఆర్ట్, మేకప్ అప్, సెట్ , కాస్ట్యూమ్ , ప్రొడక్షన్ .జనరేటర్ , లైట్స్ తదితర డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వారి దినసరి బత్తాలు(కూలి ) ఎక్కువ . ఇప్పటి వారికి పెద్ద , చిన్న సినిమాలకు ఒకే రేటు వుంది .
ఇక నుంచి సినిమాలు అంటే 3. 25 కోట్లకు మించని వాటికి 25 శాతం తగ్గిస్తారట . ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్ స్వయంగా తెలిపింది . ఈ రకంగా చిన్న సినిమాల మీద దయ చూపారు