గీత ఆర్ట్స్ లో ‘RX 100’ కార్తికేయ

యువ నటుడు కార్తికేయ కు తన రెండో సినిమా ‘హిప్పీ’ ఊహించని విధంగా దెబ్బ తీసినా బాగానే కోలుకునట్టు ఉన్నాడు. తక్షణమే ఆ సినిమా నుండి బయటకు రావడానికి ‘గుణ 369 ‘ అప్పుడే విడుదలకు సిద్ధం కాగా మరో సినిమా షూటింగ్ లో ఉంది.
ఇప్పుడే వచ్చినా, పరాజయం పలకరించినా ఇతని పై కొంత మంది నమ్మకంగా ఉన్నారు. ఈ యువ నటుడు పెద్ద హీరోగా ఎదుగుతాడని నమ్మి ఒక పెద్ద బ్యానర్లో అవకాశం అతని ఇంటి తలుపు తట్టింది. అది ఎవరో కాదో, ప్రతిభ ఎక్కడున్నా వలేసి ముందుగా పట్టుకునే అల్లు అరవింద్. ఆయన తాజాగా కార్తికేయ త్వరలో తన బ్యానర్లో ఒక సినిమా చేస్తాడని ప్రకటించారు. అదృష్టమంటే ఇదే.