క‌రోనాపై సినిమా వ‌చ్చేస్తుంది

Covid - 19

దాదాపు నెల రోజులుగా దేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ దేశాలు స‌హా భార‌త్ అష్ట‌దిగ్భంద‌నంలోకి వెళ్లిపోయింది. లాక్ డౌన్ తో దేశం ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఏప్రిల్ 14 తో ముగిస‌న లాక్ డౌన్ ని మ‌ళ్లీ మే 3 వ‌ర‌కూ పొడిగించారు. అంటే ఇంకొన్ని రోజులు అష్ట‌దిగ్భంద‌నం త‌ప్ప‌దు. అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇళ్లు దాటి కాలు బ‌య‌ట పెట్ట‌లేక‌పోతున్నారు. అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పేద‌..ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రూ స‌మాన‌మైన రోజులివి. ఇక కరోనా వైర‌స్ పై టాలీవుడ్ లో క‌థ‌లు రాయ‌డం మొద‌లు పెట్టారు ర‌చ‌యిత‌లు. హాలీవుడ్ కే ప‌రిమిత‌మైన వైర‌స్ బేస్డ్ సినిమాలు క‌రోనా కార‌ణంగా మ‌నోళ్లు పెన్ను పెట్ట‌డం మొద‌లు పెట్టారు.

అయితే మ‌నంద‌రికంటే ముందుగానే కోలీవుడ్ క‌రోనాని ఎన్ క్యాష్ చేసుకోబోతుంది. 21 డేస్ పేరుతో లాక్ డౌన్ రోజుల్లో జ‌రిగిన విష‌యాల‌ను ఇతి వృత్తంగా తీసుకుని సినిమా రూపొందిస్తున్నారు. ఎంబీర్ ఆర్ ఫిలిమ్స్ పై ఎం విజ‌య్ భాస్క‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ , హిందీ భాష‌ల్లో దీన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే ఆన్ లైన్ ద్వారా న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ మొద‌లైన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. లాక్ డౌన్ అనంత‌రం సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తిచేసి ..మిగ‌తా ప‌నులు వీలైనంత త్వ‌ర‌గా రిలీజ్ చేసి రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు.

అయితే ప్ర‌స్తుతం థియేట‌ర్లు మూత ప‌డ్డాయి కాబ‌ట్టి నేరుగా డిజిట‌ల్ స్ర్టీమింగ్ ద్వారా దీన్ని రిలీజ్ చేసే అవ‌కాశాలున్నా య‌నంటున్నారు. క‌రోనా ట్రెండింగ్ టైమ్ లోనే సినిమా రిలీజ్ చేస్తే క‌లిసొస్తుంద‌ని సంస్థ ప్లాన్ చేస్తుందిట‌. ఇక కోలీవుడ్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్ల క్రియేటివిటీ రియాల్టీకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇది వాస్త‌వ క‌థ కాబ‌ట్టి మ‌రింత రియ‌లిస్టిక్ గాచెప్పే ఛాన్సెస్ ఉన్నాయి.