కరోనా వైరస్ వస్తే వచ్చింది గానీ చాలా అద్భుతాలని సృష్టిస్తోంది. ఎప్పుడూ ఇంటి పట్టున వుండని వారు ఇళ్లకే పరిమితమైపోతున్నారు. కబుర్లు చెప్పే టైమ్ కూడా లేక నిత్యం బిజీగా తిరగే వాళ్లంతా ఫ్యామిలీతో హ్యాపీగా టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు. నిత్యం పిల్లకి అందుబాటులో వుండని వాళ్లంతా ఒక్కసారిగా చైల్డ్ హుడ్ డేస్‌లోకి వెళ్లిపోయి పిల్లల్లో పిల్లలుగా మారిపోయి వాళ్లతో ఆటలు ఆడేస్తూ ఈ క్వారెంటైన్ టైమ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
స్టార్ హీరో మహేష్ ప్రస్తుతం ఇదే పనిలో వున్నాడు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా వుంటూ డాక్లర్లు, పోలీస్ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన మహేష్‌కి ఈ నిర్భంధ సమయమే చాలా సురక్షితంగా వుందట.
తన ముద్దుల కూతురు సితారతో కలిసి క్వారెంటైన్ టైమ్‌ని గడిపేస్తూ అల్లరల్లరి చేస్తున్న మహేష్ తన క్వారెంటైన్ టైమ్‌లో ఎలా వుంటున్నాడో చిన్న హింట్ ఇస్తూ సితారతో వున్న ఓ ఫొటోని శనివారం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మహేష్ సితారతో కలిసి అల్లరి చేస్తున్న ఫొటో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది.