కొవిడ్-19 తో న‌టి మృతి

కొవిడ్-19 తో న‌టి మృతి

కొవిడ్-19 సెల‌బ్రిటీల‌ను వ‌దిలిపెట్ట‌డం లేదు. సామాన్య జ‌నంతో పాటు, సినిమా వాళ్ల‌ను చుట్టేస్తోంది. ఇటీవల కరోనా కారణంగా నటుడు మార్క్ బ్లమ్, సంగీతకారుడు సై టక్కర్, రచయిత అలాన్ మెరిల్, గ్రామీ విజేత జో డిఫ్ఫీ, నటుడు ఆండ్రూ జాక్, గాయకుడు ఆడమ్ ష్లెసింగర్, నటుడు ఫారెస్ట్ కాంప్టన్, గాయకుడు జాన్ ప్రిన్నే కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇలా వ‌రుస‌గా సినిమా వాళ్ల‌పై కొవిడ్-19 పంజా విస‌ర‌డంతో హాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది.

తాజాగా హాలీవుడ్ న‌టి హిల్ల‌రీ హీత్ కూడా కొవిడ్-19 కార‌ణంగా క‌న్ను మూశారు. హిల్ల‌రీ వ‌య‌సు 74 ఏళ్లు. వృద్ధాప్యంలో ఉన్న వారిపై క‌రోనా వైర‌స్ అత్యంత ప్ర‌భావంతంగా పనిచేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌లో జ‌రిగిన ఎక్కువ మ‌ర‌ణాలు వృద్ధాప్యంలో ఉన్న వారివే. ఈ వ‌య‌స్కులలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉండ‌టంతో మ‌ర‌ణాలు అధికంగా ఉంటున్నాయ‌ని ఇప్ప‌టికే డ‌బ్ల్యూ హెచ్ ఓ ప్ర‌క‌టించ‌న సంగ‌తి తెలిసిందే. హిల్ల‌రీ కుమారుడు అలెక్స్ విలియమ్స్ తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. వారం రోజులుగా కోవిడ్ -19 తో పోరాడుతున్నట్లు తెలిపాడు. హిల్ల‌రీ ఇంగ్లాడ్ లోని లివ‌ర్ పూల్ లో జ‌న్మించారు. 1968 లో మిచెల్ రీవ్స్ చిత్రం ‘విచ్‌ఫైండర్ జనరల్’ చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు. త‌ర్వాత 1995 లో `యాన్ ఓపులీ బిగ్ అడ్వెంచ‌ర్`, 1997 లో ‘నీల్ బై మౌత్’ వంటి చిత్రాలను నిర్మించారు.