లెజెండరీ నటుడు అమితాబచ్చ న్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కరోనా పరీక్షలు చేసుకున్నారు. ఇందులో జయాబచ్చన్, ఐశ్వర్యా రాయ్ ,ఆద్యలకు తొలి దపా పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయితే పూర్తి స్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్ టీ పీసీఆర్ పరీక్షలో ఐశ్వర్యారాయ్, ఆద్యలకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఇరువురికి కొవిడ్ పాజిటివ్ గా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బచ్చన్ ఫ్యామిలీలో ఇప్పటివరకూ నలుగురు కరోనా బారిన పడ్డట్లు అయింది.
ఇంకా జయాబచ్చన్ కి కూడా ఆర్ టీ పీసీఆర్ పరీక్ష నిర్వహించారు. అయితే ఆమెకు సంబంధించిన రిపోర్ట్ ఇంకా రానట్లు సమాచారం. మహరాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే సైతం ఈ విషయాన్ని అధికారికంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా నుంచి ఆ కుటుంబం తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలా వరుసగా బచ్చన్ ఫ్యామిలీ సభ్యులు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే అమితాబచ్చన్ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు వెల్లడించినా అభిమానుల్లో ఆందోళన మాత్రం తగ్గలేదు. తాజాగా కోడలు, మనవరాలికి కూడా సోకడంతో ఆ ఫ్యామిలీ అంతా త్వరగా కోలుకోవాలని దేవుళ్లకు ప్రార్ధనలు చేస్తున్నారు.
వైరస్ తో ఇప్పటికే మహరాష్ర్ట పోరాటం చేస్తుంది. రోజు దేశంలో అధికంగా కేసులు ఆ రాష్ర్టంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే ముంబై ధారావిని చుట్టేసింది. దీంతో అక్కడ కంటైన్మెంట్ జోన్లలలో లాక్ డౌన్ కొనసాగుతుంది. అయినా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదు. గత నెల రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ తర్వాత తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, ఏపీ చుట్టూనే కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు అప్రతమత్తమై నివారణ చర్యలు చేపడుతున్నాయి.