ఎయిటీస్ స్టోరీతోనే బావ బావ‌మ‌రిది కాంబో?

ఎయిటీస్ స్టోరీతోనే బావ బావ‌మ‌రిది కాంబో?

బావ బావ‌మ‌రిది కాన్సెప్ట్ టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. అప్ప‌ట్లో కృష్ణంరాజు- సుమ‌న్ కాంబినేష‌న్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గురించి తెలుగు లోగిళ్ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే త‌ర‌హా కాన్సెప్టుతో తెలుగులో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. అది కూడా రియ‌ల్ మెగా బావ బావ‌మ‌రుదులు ఈ చిత్రంలో న‌టించ‌నున్నార‌న్న గుసగుసా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ బావ బావ‌మ‌రిది వ‌రుణ్ తేజ్- సాయి తేజ్ ఈ త‌ర‌హా చిత్రంలో న‌టించ‌నున్నార‌ట‌. ఆస్క్ వ‌రుణ్..ఆస్క్ తేజ్ అంటూ అభిమానుల‌తో జ‌రిగిన చిట్ చాట్ సెష‌ల్ ఈ సంగ‌తి రివీలైంది.

మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నిపిస్తే మీ ఛాయిస్ ఏ హీరో అనిడిగితే తేజ్ వెంట‌నే వ‌రుణ్ తేజ్ పేరు చెప్పాడు. ఇద్ద‌రం చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులం. కాబ‌ట్టి ఒక‌రి గురించి ఒకిరికి బాగా తెలుసు. ఒక‌రికొక‌రు అర్థం చేసుకుంటాం కాబ‌ట్టి స‌మ‌స్య‌లు త‌లెత్త‌వు.. క‌లిసి న‌టిస్తామ‌ని అన్నాడు. వ‌రుణ్ తేజ్ కూడా ఆ సెష‌న్ లో అదే విష‌యాన్ని వెల్ల‌డించాడు. మంచి క‌థ దొరికితే సెట్స్ కెళతామ‌ని వెల్ల‌డించాడు. కెరీర్ ప‌రంగా ఆ ఇద్ద‌రూ డిఫ‌రెంట్ రూట్స్ ని ఎంచుకున్నారు. వెళ్లే దారిలో వ‌రుణ్ ఓ మెట్టు పైన ఉన్నాడు. మెగా మేన‌ల్లుడికి స‌క్సెస్ అంతంత‌మాత్రంగానే ఉంది. ఆ ఇద్ద‌రూ క‌లిస్తే మ‌రి ల‌క్ క‌లిసొస్తుందేమో చూడాలి. కాస్త ప్రీప్లాన్డ్ గానే ఉన్నారు మెగా హీరోలు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్.

 

  • TAGS