Tollywood: టాలీవుడ్ అగ్ర హీరోలు అయినా బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోలుగా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇద్దరు హీరోలకు ఉన్న ఫ్యాన్స్ బేస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బాలయ్య బాబుకు విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఏ సినిమా హాల్ కి వెళ్లిన ఏ సినిమా విడుదల అవుతున్నా కూడా జై బాలయ్య అనే నినాదం తప్పకుండా వినిపిస్తూ ఉంటుంది.
ఇకపోతే వెంకీ మామ బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వెంకీ మామ చివరగా సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరోవైపు బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు బాలయ్య బాబు.
ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ అలాగే వెంకి మామకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే.. ఇటీవల కాలంలో స్టార్ హీరోలు కలిసి మెలిసి నటించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మల్టీస్టారర్ సినిమాల జోరు ఊపందుకున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టార్ సినిమాలను కూడా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ వరసలో మరో సినిమాకి రంగం సిద్ధమైంది. అగ్ర హీరోలు అయినా బాలకృష్ణ, వెంకటేశ్ కాంబోలో ఒక సినిమా రూపొందబోతోంది. ఈ విషయాన్ని అమెరికాలో జరుగుతున్న నాట్స్ 2025 వేడుకలో హీరో వెంకటేశ్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమాలో వెంకటేశ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే బాలకృష్ణతో కలిసి కెమెరా ముందుకు వెళ్లనున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అందులోనే వెంకటేశ్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. మరి ముందు ముందు ఈ వార్తపై పూర్తి క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.
