శర్వా, నాని మల్టీ స్టారర్.?

మల్టీ స్టారర్స్ ట్రెండ్ బాగా వర్కవుట్ అవుతోంది ప్రస్తుత కాలంలో. సినిమా రిజల్ట్ ఎలా వున్నా కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయ్. కొన్ని సినిమాలయితే గ్లోబల్ రేంజ్ మాట్లాడుకునేలా చేస్తున్నాయ్. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ‘ఆర్ఆర్ఆర్’.

అందుకే ముందు ముందు ఆ తరహా మల్టీ స్టారర్ మూవీస్‌కి మేకర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ స్థాయిలో కాకున్నా.. మీడియం రేంజ్ మల్టీ స్టారర్ సినిమాలకూ క్రేజ్ తక్కువేమీ కాదండోయ్.

అందుకే మీడియం రేంజ్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలకు సై సై అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మల్టీ స్టారర్ తాజాగా తెరపైకి వచ్చింది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్, సహజ నటుడు నాని కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రూపొందే అవకాశాలు త్వరలో కనిపిస్తున్నాయ్.

ఈ కాంబినేషన్‌లో ఓ కథ రూపుదిద్దుకుందట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ తరహా కథ సిద్ధం చేయగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆమోద ముద్ర వేసిందనీ సమాచారం. ఈ కథలో నటించేందుకు శర్వానంద్, నాని కూడా పచ్చ జెండా ఊపినట్లు ఇన్‌సైడ్ సమాచారం.

అయితే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఇంకా చాలా టైమ్ పట్టే అవకాశాలున్నాయ్. కథపై ఇంకా చర్చోపచర్చలు నడుస్తున్నాయట. తెలుగుతో పాటూ, ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుందనీ తెలుస్తోంది.