మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్యా మంచి సన్నిహిత సంబంధాలున్నాయ్. ఇద్దరూ కలిసి సినిమా చేద్దాం అని చాన్నాళ్లుగా అనుకుంటున్నారట. మంచి స్ర్కిప్ట్ కోసం ఎదురు చూస్తున్నారట.
చిరంజీవి, రజనీకాంత్.. ఈ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ కోసం ఓ తమిళ డైరెక్టర్ గతంలోనే ప్లాన్ చేశాడు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు.
ఈ మధ్య చిరంజీవి, రజనీకాంత్ తరచూ మాట్లాడుకుంటున్నారట. త్వరలో చిరంజీవి ఇంటికి రజనీ కాంత్ వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్ జస్ట్ క్యాజువల్ మీటింగ్‌నా.?
లేక సినిమా గురించి మాట్లాడుకోవడం కోసమా.? లేదంటే, రాజకీయపరమైన చర్చలేమైనా వీరి మధ్య వచ్చే అవకాశముందా.? అని ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. చూడాలి మరి.