సాయిధరమ్‌తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన`. మైత్రీ మూవీమేకర్స్‌తో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ జాలరి ప్రేమకథగా కొత్త పంథాలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ అనూహ్యంగా ప్రబలుతుండటంతో రిలీజ్‌ని వాయిదా వేశారు.
స్రస్తుత పరిస్థితుల్లో మార్పులు వచ్చాక అంటే మే 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ లోపు చాలా సమయం వుండటంతో సినిమా చూసిన సుకుమార్ కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. లాక్ డౌన్ ప్రకటించిన దగ్గరి నుంచి సుకుమార్ ఎడిటింగ్ రూమ్‌కే సరిమితం అయిపోయారని, ఎక్కడ ట్రిమ్ చేస్తే బాగుంటుందో అక్కడ కత్తెరేయడం మొదలుపెట్టారని చెబుతున్నారు.
ఒక కొత్త హీరోని నమ్మి ఈ సినిమాకు మేకర్స్ ఈ సినిమాకు 22 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. దీంతో ఇంత మొత్తం చెల్లించి సినిమాని కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రాకపోవడంతో మైత్రీ మూవీమేకర్స్ వారే ఓన్ రిలీజ్‌కు రెడీ అయిపోయారట. మరి వారి పెట్టుబడిని `ఉప్పెన` తిరిగి తెచ్చిపెడుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.