ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ తో ఇలియానా చాలా కాలం సహజీవనం సాగించాక ఈ ఏడాది ఆగస్టులో విడిపోయారు. ”ఇక నేను ఎవ్వరినీ ప్రేమించలేను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా’ అని చెబుతోంది ఇలియానా.
ఆండ్రూతో చాలా కాలం జీవితం పంచుకున్న ఇలియానా అతనితో విడిపోయాక తన సోషల్ మీడియా ఖాతాల్లో అతనితో కలసి దిగిన ఫొటోలన్నింటినీ తొలగించింది. ఆండ్రూ గురించి మాట్లాడుతూ… “నేను ఎప్పుడూ శత్రువులను పెంచుకోను. ఆయన నా నుంచి వెళ్లిపోయారు. అది అలా జరిగిపోయింది. జీవితం అలా సాగిపోతుంది. కానీ ఇతరుల ప్రేమను గౌరవిస్తాను. ఆయన గురించి ఎటువంటి చెడు ఆలోచన లేదు” అని చెప్పింది ఇలియా.
ఇలియానా ప్రస్తుతం ‘పాగల్‌పంటీ’ చిత్రంలో నటిస్తుంది. అభిషేక్ బచ్చన్‌తో ‘బిగ్ బుల్’లో కథానాయికగా చేస్తోంది.