ఒక సంఘటన అనూహ్య మలుపులు తిరుగుతోంది. వందల కోట్ల ప్రాజెక్ట్‌ని ప్రశ్నార్థకంలో పడేస్తోంది. కమల్‌హాసన్ నటిస్తున్న `ఇండియన్ 2` ఇప్పుడు దక్షిణాదిలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ మూవీ చిత్రీకరణ సందర్భంలో ఇటీవల షూటింగ్ లొకేషన్లో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిపడి సెట్లో వున్న ముగ్గురు అసిస్టెంట్లు ప్రాణాలు విడిచారు. ఈ హృదయవిదారక సంఘటన `ఇండియన్ 2` చిత్రంపై నీలి నీడలు కమ్మేలా చేస్తోంది.
షూటింగ్ లొకేషన్లో లైకా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వాదిస్తూ వస్తున్న కమల్ ఈ విషయంలో మరింత స్పష్టతతో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే షూటింగ్లో పాలల్గొంటానని లైకాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై లైకా వర్గాలు ఘాటుగానే స్పందించడం కోలీవుడ్‌లో కొత్త రచ్చకు తెరతీసింది. తాజాగా కమల్ జరిగిన దుర్ఘటనపై ప్రశ్నించిన పోలీసులతో కూడా లైకా తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందిని వెల్లడించినట్టు తెలిసింది. దీంతో `ఇండియన్-2` ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తోందిని, ఇప్పటికే ఈ చిత్రం కోసం లైకా వంద కోట్లు ఖర్చు చేసిందని, అదంతా బూడిదలో సోసిన పన్నీరు కావడం ఖాయమని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.