ఆ హీరోయిన్‌ని ఆ డైరెక్ట‌ర్ ప‌ర్మ‌నెంట్‌గా ఉంచేసుకున్నాడా?

సినిమా వాళ్ళ రిలేష‌న్స్ చాలా వింత‌గా ఉంటాయి. ఎప్పుడు ఎవ‌ర్ని క‌లుస్తారు ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డ‌తారో ఎవ్వ‌రికీ అర్ధం కాదు. ఇందులో హీరోహీరోయిన్లు మాత్ర‌మే కాదు ఇందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా మిన‌హాయింపు ఏమీ లేదు. ఇక ఇదిలా ఉంటే ఓ స్టార్ డైరెక్ట‌ర్ మ‌రో స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో డైరెక్ట‌ర్ గ‌తంలో త‌న వ‌ల్ల త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కే ప్రాబ్ల‌మ్ వ‌చ్చిన హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చాడు. గ‌తంలో ఆ హీరోయిన్ వ‌ల్ల పెళ్ళై ఏడాది కూడా కాపురం చెయ్య‌కుండానే ఆ ద‌ర్శ‌కుడు అత‌ని భార్య‌కు విడాకులు ఇచ్చాడు . ఆలాంటిది ఇప్పుడు సేమ్ అదే హీరోయిన్‌కి తిరిగి త‌న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు.

దీంతో అంటే వీరిద్ద‌రూ క‌లిసే ఉన్నారా. ఆ డైరెక్ట‌ర్ ఆ హీరోయిన్‌కి అంత‌లాగా క‌నెక్ట్ అయిపోయాడా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. హీరో మంచు విష్ణుతో క‌లిసి చేసిన చిత్ర‌మే ఆఖ‌రిగా న‌టించింది. అదే ఆమెకు ఆఖ‌రి చిత్రం అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఎందులోనూ చెయ్య‌డం లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఆ భామకి పెద్ద‌గా సినిమాలు లేక‌పోయినప్ప‌టికీ ఆ ద‌ర్శ‌కుడు ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో చాలా మంది ఆమెను ప‌ర్మ‌నెంట్‌గా ఉంచేసుకున్నాడా అన్న మాట‌లు కూడా వినిపిస్తున్నాయి.

మ‌రి దీనిని బ‌ట్టి ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో గాసిప్‌గా తీసుకున్నా ఇప్పుడు ఈయ‌నగారు ఇచ్చే ఛాన్స్‌తో క‌న్ఫ‌ర్మ్ అవుతున్నారు చాలా మంది. పైగా త‌న‌కు ఈ మ‌ధ్య సినిమాలు లేక అవుట్ డేటెడ్ హీరోయిన్‌గా ఉన్న ఆమెకు ఏకంగా ఓ పెద్ద స్టార్ హీరోతోనే ఛాన్స్ ఇచ్చేశాడు ఆ ద‌ర్శ‌కుడు మ‌రి ఇందుకు క‌న్ఫ‌ర్మ్ అవ్వ‌క ఏమ‌వుతారు ఇంక‌. ఏది ఏమైన‌ప్ప‌టికీ పెళ్ళి, భార్య భ‌ర్త‌ల బంధానికి మ‌న దేశంలో ఎంతో మంచి విలువుంది. అలాంటి సంస్కృతిని కూడా ప‌క్క‌న పెడుతున్నారు కొంద‌రు సెల‌బ్రెటీలు.