‘ఆర్ఆర్ఆర్’లో  ఎన్టీఆర్ గురించి !

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ అలా చేస్తున్నారా?
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న  భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’.  దర్శక ధీరుడు  రాజమౌళి డైరెక్షన్ లో  రాబోతున్న  ఈ అత్యున్నత భారీ మల్టీస్టారర్ లో  ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఫిల్మ్ సర్కిల్స్ లో  ఒక ఇంట్రస్టింగ్  అప్ డేట్ తెలిసింది.  ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు  గెటప్స్ లో కనిపిస్తాడని.. ఒకటి ట్రైబ్ గెటప్ కాగా,  రెండోది అప్పటి రోజుల్లోని  విప్లవకారుడి గెటప్ ఆట.  అలాగే  ఎన్టీఆర్ సీన్స్  అన్ని గ్రాండ్ గా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని..  ముఖ్యంగా  తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కూడా చాలా గొప్పగా  ఉంటాయని  ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్  అచ్చం  కొమరం భీంలానే ఉంటాడట. 
 

 

కాగా పరిమిత సిబ్బందితో చిత్రీకరణ ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం పరిమిత సభ్యులతో  ఈ వారంలోనే షూట్ ను స్టార్ట్ కానుంది.   రాజమౌళి ఇప్పటికే షూటింగ్  కోసం ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించారట. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు..  ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా  ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను  తీసుకున్నారు.

 
నిర్మాత డివివి దానయ్య సెట్స్‌ పై కఠినమైన చర్యలు పాటించేలా చూసుకోనున్నారు. పైగా షూట్ కూడా ఎక్కువగా ఇంట్లోనే జరుగుతుంది.  అది కూడా టాకీ పార్ట్స్ మాత్రమే.  మరి రాబోయే రోజుల్లో షూట్  ఎలా కొనసాగుతుందో చూడాలి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  కాగా  ‘బాహుబలి’ తరవాత   రాజమౌళి  చేస్తున్న సినిమా కావడంతో  ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా పై ఆరంభం నుండి  భారతీయ  అన్ని  సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.