అల్లు అర్జున్ ‘ఐకాన్’ లో ‘లోఫర్’ హీరోయిన్?

అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న ‘అల వైకుంఠపురంములో’ సినిమా తరువాత వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్-దిల్ రాజు కలయికలో ఇది నాలుగో సినిమా. అందువల్ల ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఒక పేరు ఖరారు అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.

ఆమె ఎవరంటే వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమా హీరోయిన్ దిశా పథాని. ఆమె తెలుగులో చేసిన ‘లోఫర్’ పరాజయం కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ మంచి విజయాలే అందుకుంది. కానీ ఇప్పుడు ఆమెకె ఈ ప్రాజెక్ట్ వెళ్లిందని సమాచారం.

పైగా ఇందులో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉందట. అందువల్ల ఆమె కాదనే అవకాశమే లేదు. అదే నిజమైతే అల్లు అర్జున్ సరసన సరి కొత్తగా మెరిసి మళ్ళీ తెలుగులో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది దిసాకి, ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.