స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అంటూ తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా “పుష్ప” తో చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రెజెంట్ చేసేసారు. ఇది పక్కన పెడితే అసలు అల్లు అర్జున్ కి ఐకాన్ అనే ట్యాగ్ పుష్ప కంటే ముందే వచ్చింది. దర్శకుడు వేణు శ్రీరామ్ తో ప్లాన్ చేసిన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా అది “ఐకాన్”. దీనిపై అప్పట్లోనే భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ మధ్యలో పుష్ప రావడంతో ఇది మరింత లేట్ అయ్యింది.
సరే తర్వాత అయినా మొదలు అవుతుంది అని బజ్ వచ్చినా ఇప్పుడు మాత్రం ఈ సినిమా పూర్తిగా నిలిచిపోయినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కారణాలు ఏమో కానీ బన్నీ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ గా తుడిచి పెట్టుకుపోయిందట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అలాగే పుష్ప పై కూడా నెగిటివ్ వార్తలే వినిపిస్తున్నాయి. మరి దీనికేం అవుతుందో చూడాలి.