టాలీవుడ్ హీరోస్ లో హిందీ సహా ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఎప్పుడు నుంచో ఉన్న ఒకే ఒక్క హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. కాగా బన్నీ అయితే ఎప్పుడు నుంచో ఉన్న ఈ క్రేజ్ ని “పుష్ప” అనే పాన్ ఇండియా సబ్జెక్టు తో ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక పుష్ప 2 ఫస్ట్ లుక్ తో అయితే పాన్ ఇండియా వైడ్ మారు మూల ప్రాంతాలకి కూడా బన్నీ బొమ్మ వెళ్ళిపోయింది అయితే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా క్రేజ్ ఉందని ముందు పసిగట్టి ప్లాన్ చేసిన మొదటి సినిమా మాత్రం పుష్ప కాదు. దానికి ముందే దర్శకుడు శ్రీరామ్ వేణు దిల్ రాజు కాంబినేషన్ లో స్టార్ట్ చేసిన సినిమానే “ఐకాన్”.
పుష్ప కన్నా ముందే ఐకాన్ అనే ట్యాగ్ బన్నీ కి ఈ చిత్రం నుంచి స్టార్ట్ అయ్యింది. నిజానికి పుష్ప 1 తర్వాత స్టార్ట్ కావాల్సిన ఈ చిత్రం అలా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఫైనల్ గా అయితే అల్లు అర్జున్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మరి ఈ సినిమా అయితే ఇప్పుడు ఫైనల్ గా యంగ్ హీరో నితిన్ దగ్గరకి వచ్చినట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.
నితిన్ కోసం తన సబ్జెక్టు లో మొదట బన్నీ కోసం రాసుకున్న కొన్ని అంశాలు మార్పులు చేసి ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ ని తాను సిద్ధం చేసాడని టాక్. దీనితో ఫైనల్ గా బన్నీ మొదటి పాన్ ఇండియా సినిమా అయితే ఇపుడు నితిన్ దగ్గరకి వచ్చింది అని చెప్పాలి.