‘ఐకాన్’ ఆగమనం.. కంగారులో ‘ పుష్ప’ నిర్మాతలు

Mythri producers in deep trouble
Mythri producers in deep trouble
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా చాలా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చేస్తున్నారు.  ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలని ఇటీవలే డిసైడ్ చేశారు.  దీంతో అల్లు అర్జున్ ప్లాన్స్ కూడ మారాయట.  ‘పుష్ప-1’ ముగింపు దశలో ఉంది.  అది పూర్తికాగానే సెకండ్ పార్ట్ మొదలుపెట్టడానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఈలోపు ‘ఐకాన్’ చిత్రాన్ని మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు.  వేణు శ్రీరామ్ రంగంలోకి దిగి ప్రీప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాడు కూడ.  అయితే ఇక్కడే ఒక చిక్కు మొదలైంది.  
 
‘పుష్ప’ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ అల్లు అర్జున్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారట.  ఎందుకంటే ఫస్ట్ పార్ట్ పూర్తికాగానే కాస్త గ్యాప్ తీసుకుని రెండవ భాగాన్ని మొదలుపెట్టాలని, పార్ట్ 1, పార్ట్ 2 వెంట వెంటనే విడుదలైతేనే ఆ క్రేజ్ ఉంటుందని మైత్రీ నిర్మాతల ఆలోచన. అది నిజమే కూడ.  ‘బాహుబలి, కెజిఎఫ్’ సినిమాలు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సీక్వెల్స్ తో వచ్చాయి.  కాబట్టే వాటి రెండవ భాగాలకు అంత క్రేజ్ ఏర్పడింది.  ఇప్పుడు అల్లు అర్జున్ పార్ట్1, 2 కు మధ్యలో ‘ఐకాన్’ చేస్తే ఏడాది ఆలస్యం అవుతుంది.  అప్పటికి ‘పుష్ప 2’ క్రేజ్ సన్నగిల్లివచ్చు. అంతేకాదు ‘ఐకాన్’ రిజల్ట్ కూడ పార్ట్2 మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.  ఇదే మైత్రీ నిర్మాతలను టెంక్షన్ పెడుతోంది.