అల్లుఅర్జున్ సుకుమార్ అప్పుడే మొద‌లెట్టేస్తున్నారా?

సంక్రాంతి బ‌రిలో దిగిన అల్లుఅర్జున్ త్రివిక్ర‌మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో`ఈ చిత్రం సంక్రాంతికి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసింది. బాక్సాఫీస్ ముందు మంచి క‌లెక్ష‌న్లతో ఓవ‌ర్సీస్‌లో కూడా మంచి విజ‌యాన్ని సాధించింది. ఇక ఈ చిత్రం హిట్ విష‌యంలో ఫుల్ హ్యాపీగా ఉన్న బ‌న్నీ… ఇప్పుడు త‌న నెక్స్‌ట్ ప్రాజెక్ట్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రాబోతుంది. ఈ చిత్రం ఆల్రెడీ సెట్స్ మీద‌కి వెళ్ళి కొన్ని రోజులు షూటింగ్ కూడా జ‌రిపేసుకుంది. అయితే ఈ చిత్రం పూర్తీ స్థాయి షూటింగ్ మాత్రం ఫిబ్రవరి నెల నుండి జరగనుంది అని దర్శకుడు సుకుమార్ అన్నారు. స్వగ్రామానికి చేరుకున్న సుకుమార్, సంక్రాంతి సంబరాల్ని స్వగ్రామమైన ముట్టుపర్రులో జరుపుకున్నారు. సంక్రాంతికి శంకరగుప్తం వచ్చిన జబర్దస్త్ ఫేమ్ మహేష్ సుకుమార్ ఆశీస్సులు తీసుకున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో వున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ `అలా వైకుంఠపురంలో` చిత్రం ఫుల్ వసూళ్లను సాధిస్తూ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ గా నిలిచే అవకాశం వుంది. బాహుబలి2, సాహో చిత్రాల తర్వాత అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు ప్రీ రిలీజ్ చేసిన బిజినెస్ కు 70 శాతం వరకు రికవరీ చేసేసినట్లు సమాచారం. మరి అల్లు అర్జున్ ఇదే జోష్ లో సుకుమార్ చిత్రం లో నటించబోతున్నాడు.

ఇక ఎక్క‌డా బ్రేక్ లేకుండా ఆయ‌న వ‌రుస చిత్రాలు చేసుకుంటూ వెళ్ళిపోతాన‌ని ఇటీవ‌లె జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అయితే అల్లుఅర్జున్‌కి కాస్త గ్యాప్ ఎక్కువే వ‌చ్చినా కూడా త‌న క్రేజ్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని రీసెంట్‌గా విడుద‌లైన అల చిత్రం ద్వారా నిరూపించుకున్నార‌నిపించింది. అలాగే అల్లు అర్జున్‌కి వేరే హీరోల్లా కాకుండా ఇత‌ర భాష‌ల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నార‌నే చెప్పాలి.